కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. పది రోజుల వ్యవధిలోనే రెండుసార్లు గ్రామంలో దొంగతనాలు చేశారు. నగదు, అభరణాలు, వాహనాలు.. చివరికి పబ్లిక్ టాయిలెట్స్‌లో ఉన్న ఇనుప సామాన్లు కూడా ఎత్తుకెళ్లారు. గత నెల మార్చి 23న ఓ ఇంట్లో నగదు, ఆభరణాలు దొంగిలించగా, అదే రోజు బైక్‌ను ఎత్తుకెళ్లారు. గురువారం అర్ధరాత్రి మేడే కాలనీలో చోరీ చేశారు. ప్రగతి స్కూల్ ఎదురుగా ఉన్న జక్కుల కిషన్ ఇంట్లో 20 వేల నగదును, వస్తువులను దొంగిలించారు. అలాగే సారపాక పబ్లిక్ టాయిలెట్స్‌లో ట్యాప్‌లు, ఇనుప పనిముట్లను చోరీ చేశారు. జనసంచారం ఉన్న కాలనీల్లో దొంగతనాలు జరుగుతుండటం స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.
Read Also: ఫ్లేమ్ లెస్ కిచెన్ : మంట లేకుండానే 1500 మందికి వంట
Follow Us On : WhatsApp

