రెండు బైకులు ఢీ.. వ్యక్తి మృతి

కలం, వెబ్ డెస్క్ : జనగామ (Jangaon) జిల్లా తరిగొప్పుల మండలంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆళ్ల రామ్ చరణ్ సోలిపురం నుంచి నరసయ్య పల్లికి బైక్‌పై వెళ్తున్న క్రమంలో కూటిగల్ నుంచి తరిగొప్పుల వైపు వస్తున్న రాహుల్ బైక్ ఢీకొంది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీ కొట్టుకోవడంతో రామ్ చరణ్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వెనక కూర్చున్న నర్సాపూర్‌కు చెందిన స్వాతిక గాయపడటంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also: గిగ్ వర్కర్లకు ఏసీ విశ్రాంతి కేంద్రాలు

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>