కలం, వెబ్ డెస్క్ : ఎండనక, వాననక తమ కస్టమర్లకు ఆర్డర్లు డెలివరీ చేయడానికి గిగ్ వర్కర్ల కష్టం అంతా ఇంతా కాదు. అలాగే, సరైన సమయంలో వినియోగదారులకు ప్రొడక్టును అందించడానికి ఉరుకుల పరుగులు పెడుతూ డెలివరీ వర్కర్స్ నానా తంటాలు పడుతుంటారు. ఈ క్రమంలో వారికి అవసరమైన చార్జీంగ్, వాష్ రూమ్స్ సౌలభ్యం దొరకగా ఇబ్బంది పడుతుంటారు. గిగ్ వర్కర్ల కష్టాన్ని గుర్తించిన అమెజాన్ సంస్థ ఓ మంచి నిర్ణయం తీసుకుంది. డెలివరీ కార్మికుల కోసం అమెజాన్ ‘ఆశ్రయ్’ (Amazon Ashray) పేరిట విశ్రాంతి కేంద్రాలను ప్రారంభించింది.
ప్రతి రోజూ రోడ్లపై ఎండలో తిరుగుతున్న గిగ్ వర్కర్ల కోసం మొబైల్ ఏసీ విశ్రాంతి గదులను (Amazon Ashray) ఏర్పాటు చేసింది. రెస్ట్ రుముల్లో ఏసీ, తాగునీరు, ఫోన్ ఛార్జింగ్, వాష్ రూములు లాంటి సౌకర్యాలు కల్పించింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ ఆకర్షిస్తోంది.
వీటిల్లో కేవలం తమ సంస్థ కార్మికులే కాకుండా స్విగ్గీ, జొమాటో, జెప్టో, ఇతర డెలివరీ రైడర్లు కూడా వీటిని ఉపయోగించుకునేందుకు అమెజాన్ అవకాశం కల్పించింది. ప్రస్తుతం భారత్ లోని 16 నగరాల్లో 100 ఆశ్రయ్ కేంద్రాలను నిర్వహిస్తున్నామని.. 2026 చివరి నాటికి 250కి పై విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు అమెజాన్ వెల్లడించింది.
-గిగ్ వర్కర్ల కోసం అమెజాన్ గ్రేట్ డెసిషన్
-డెలివరీ బాయ్స్ కి ఎండ నుంచి ఉపశమనం కోసం ‘ఆశ్రయ్’ పేరిట మొబైల్ ఏసీ విశ్రాంతి రూమ్స్ ఏర్పాటు
Amazon Launches ‘Ashray’ Rest Centers#AmazonAshray #GigWorkers #DeliveryRiders #Kalam #KalamDaily #KalamTelugu pic.twitter.com/oaaurur9iT— Kalam Daily (@kalamtelugu) May 16, 2026
Read Also: సిట్ ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.. కొనసాగుతున్న విచారణ
Follow Us On: WhatsApp

