కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ శామీర్‌పేట్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై (Outer Ring Road) ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కీసర నుంచి మేడ్చల్ వెళ్తున్న ఓ కంటైనర్ ట్రక్కును డీసీఎం వ్యాన్ వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇటీవల తరచూ ప్రమాదాలు..
ఔటర్ రింగ్ రోడ్డు (Outer Ring Road) ఇటీవల కాలంలో ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. ఇటీవలే శంషాబాద్ దగ్గర జరిగిన ప్రమాదంలో సిరిసిల్లకు చెందిన ఆరుగురు మరణించారు. అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ప్రతి రోజు కనీసం అయిదు ప్రమాదాలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా వాహనదారులు పరిమితికి మించిన వేగంతో వెళ్తుండటం గమనార్హం. రోజూ దాదాపు 2.8 లక్షల వాహనాలు ఓఆర్ఆర్‌పై ప్రయాణిస్తున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
Read Also: ఆసియా రెజ్లింగ్‌లో ఫైనల్‌కు చేరిన భారత్!
Read Also: ఏసీబీ దూకుడు.. కటకటాల్లోకి కరప్షన్ కింగ్స్!

