బిగ్ రిలీఫ్.. తిరుమలలో ఒక్కసారిగా మారిన వాతావరణం

కలం, వెబ్ డెస్క్: ఎండ తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుమలలోని భక్తులకు భారీ ఉపశమనం లభించింది. తిరుమలలో ఒక్కసారిగా వాతావరణం మారింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడి భారీ వర్షం (Tirumala Heavy Rain) కురిసింది. ఒక్కసారిగా పడ్డ వర్షానికి ఆలయ పరిసర ప్రాంతాలు, ముఖ్యమైన రహదారులు నీటి మునిగాయి.

ఉదయం నుంచి తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడిపోయిన భక్తులకు ఈ వర్షం బిగ్ రిలీఫ్ ను అందించింది. మరోవైపు నగరిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. వర్షం వల్ల పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>