Mobile Popup Ad
Mobile Popup Ad

రెవెన్యూ అధికారులను బంధించిన రైతులు

రెవెన్యూ అధికారులను రైతులు బంధించిన ఘటన సంగారెడ్డి(Sangareddy) జిల్లాలో చోటు చేసుకున్నది. చౌటకూర్ మండలం శివ్వంపేట గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో భూసేకరణ నోటీసులు అందజేయడానికి ఆర్‌ఐ ప్రమోద్, జీపీటీ ప్రవీణ్‌ వచ్చారు. ఈ క్రమంలో రైతులు వారిని పంచాయతీ కార్యాలయంలో బంధించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. “మా భూమి ఒక్క ఎకరాకు కోటి పలుకుతోంది. కానీ కేవలం రూ.16 లక్షలకు ఇస్తామని చెప్పడం సరికాదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ కోసం భూసేకరణ నోటీసులు ఇచ్చేందుకు మాత్రమే వచ్చామని చెప్పారు. అయినప్పటికీ, రైతులు అధికారులను బలవంతంగా పంచాయతీ కార్యాలయంలోకి తీసుకెళ్లి బంధంగా ఉంచారు.

Sangareddy | విషయం తెలుసుకున్న జోగిపేట సబ్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) అనీల్ కుమార్, పోలీసులు‌తో సహా శివ్వంపేటకు చేరుకొని రైతులను నచ్చజెప్పి అధికారులు ముక్తి చేశారు. ఈ సమయంలో కొద్దిసేపు రైతులు సీఐతో వాగ్వివాదానికి దిగారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను అంటూ సీఐ రైతులకు నచ్చచెప్పారు.

Read Also: టాకోఫోబియా అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? ఎలా నివారించాలి?

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>