“రైతు స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డంలో కాంగ్రెస్ ఫెయిల్”

కలం, ఖమ్మం బ్యూరో: రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడంలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫల‌మైంద‌ని బీఆర్ఎస్ (BRS) నేతలు ఆరోపించారు. వ్యవసాయ రంగంలో సమస్యల పరిష్కారంపై ఏ మాత్రం దృష్టి పెట్టకుండా తీవ్ర నిర్లక్ష్యం వహించడం పట్ల రైతన్నలు,ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. రైతాంగ సమస్య పరిష్కారం కోసం బీఆర్ఎస్ ఖమ్మం (Khammam) జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట శుక్రవారం మహాధర్నా నిర్వ‌హించారు. ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అధ్యక్షత వహించగా, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర,మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎండలు మండిపోతుంటే మొక్కజొన్నల్లో తేమ ఉందంటూ క్వింటాలుకు 5 కిలోల చొప్పున తరుగు తీయడం విడ్డూరంగా ఉందన్నారు.

నాడు సీఎం కేసీఆర్ రైతుబంధు ప్రవేశపెట్టి క్రమం తప్పకుండా పెట్టుబడి సాయం అందించారని, ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుందద‌ని ఆరోపించారు. కౌలుదార్లకు కూడా రైతుభరోసా (Rythu Bharosa) అందిస్తామని కాంగ్రెస్ నాయకులు హామీనిచ్చి ఉల్లంఘించారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో సాగు నీరందక, కరెంట్ సరఫరా కోతల కారణంగా పంటలు ఎండిపోయాయని, యాప్ పెట్టడంతో యూరియా కోసం తిరిగి తిరిగి రైతున్నల కాళ్లకు వాపులొచ్చాయని ఎంపీ వద్దిరాజు (MP Vaddiraju) వివరించారు. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులున్నా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో విఫలం చెందారని మాజీ మంత్రి పువ్వాడ విమర్శించారు.

బీఆర్ఎస్ హ‌యాంలో రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేశామ‌న్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక చెల్లదని హైకోర్టు తీర్పు ఇవ్వడం ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిందన్నారు. మహాధర్నా అనంతరం రవిచంద్ర నాగలి, మధు,అజయ్,కమల్ రాజ్,వెంకటరమణ తదితర నాయకులు ప్లకార్డులు చేతబట్టుకుని మండుటెండలో కలెక్టరేట్‌లో నేలపై కూర్చొని మొక్కజొన్న, వడ్లు కొనుగోలు చేసి రైతన్నలకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆ తర్వాత అడిషనల్ కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

Read Also: పెళ్లిలో ఇదో కొత్త ట్రెండ్.. ఈ హైటెక్ మర్యాదలు చూస్తే షాక్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>