కలం, వెబ్ డెస్క్: ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ (Shankar Goud) మృతి అత్యంత బాధాకరమని కాంగ్రెస్ నేత, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ (Addanki Dayakar) అన్నారు. ఆయన మృతిని కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజకీయం చేస్తున్న తీరు హేయనీయమని.. సిగ్గుచేటు అని పేర్కొన్నారు. ఒక వైపు బీఆర్ఎస్ నాయకులు కార్మికులను రెచ్చగొడుతుంటే మరో వైపు బీజేపీ నాయకులు శవరాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సంపేటలో ఉద్రికత్తలకు కారణం బండి సంజయ్ (Bandi Sanjay) అని.. బండి సంజయ్ శవ రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు. కేంద్ర మంత్రి అనే విషయాన్ని మరిచిపోయి బండి సంజయ్ కార్మికులను రెచ్చగొట్టేలా వ్యవహారిస్తున్నాడని ఫైర్ అయ్యారు. గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా స్పందించిందో అందరికి తెలుసు అని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా శంకర్ గౌడ్ కుటుంబాన్ని కలిసి ఆదుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. శంకర్ గౌడ్ కుటుంబం పట్ల తమ ప్రభుత్వం సానుభూతితో ఉందని చెప్పారు.
తమ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరుపుతోందని.. చనిపోయిన ఆర్టీసీ కార్మికుడి కుటుంబానికి అండగా ఉంటామని ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ఒక వైపు సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చేస్తుంటే బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రి వర్గం అంతా ఆర్టీసీ కార్మికులు తొందరపడొద్దని విజ్ఞప్తి చేశారని చెప్పారు. సమస్య పరిష్కారం కోసం తాము ప్రయత్నం చేస్తుంటే.. బండి సంజయ్, బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఓట్లు వెతుకుంటున్నారని ఆరోపించారు. దయచేసి ఆర్టీసీ కార్మికులు ఇలాంటి క్షుద్ర రాజకీయ పార్టీలను, నాయకులను నమ్మెద్దని ఆయన (Addanki Dayakar) హితవు పలికారు. కచ్చితంగా కార్మికులకు అండగా తమ ప్రభుత్వం ఉంటుందని హామీ ఇచ్చారు.
Read Also: రైతులను మరోసారి మోసం చేయొద్దు.. సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
Follow Us On : WhatsApp

