కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయం హుండీలో నకిలీ నోట్లు

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌ (Hyderabad) లోని కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయం హుండీలో భక్తులు సమర్పించిన కానుకల మధ్య నకిలీ నోట్లు (Fake Currency) కనుగొన్నారు. ఈ నోట్లు 100, 200, 500 రూపాయల విభాగాలలో ఉన్నాయి. పైగా వాటిపై “చిల్డ్రన్స్ బ్యాంక్”(Childrens Bank) అనే ముద్ర కూడా ఉందని ఆలయ అధికారులు తెలిపారు. పవిత్రమైన ఆలయాల్లో ఇలాంటి అపచారానికి పాల్పడటం ఏంటని.. భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి ఇచ్చే స్వచ్చమైన నిధులు పవిత్రంగా ఉండాలి. నకిలీ నోట్లు వంటి ఘటనలు ఆధ్యాత్మికతను తగ్గిస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆలయ అధికారులు వెల్లడించారు.

Read Also: డైలీ డేటా లిమిట్ పేరుతో టెలికాం కంపెనీల మోసం.. ఆప్ ఎంపీ

Follow Us On: Instagram

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>