Mobile Popup Ad
Mobile Popup Ad

తల్లిదండ్రులకు హెచ్చరిక.. పిల్లలకు ఇది ఇస్తే డ్రగ్స్ ఇచ్చినట్టే!

కలం, వెబ్‌డెస్క్: ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ చూడడం (Smartphone Addiction) , రీల్స్ స్క్రోల్ చేయడం ప్రతీఒక్కరికి అలవాటుగా మారిపోయింది. కాస్త ఖాళీ టైమ్ దొరికితే చాలు ఫోన్లో రీల్స్ చూస్తూ టైమ్ పాస్ చేస్తుంటారు. ఈ అలవాటు పెద్దలలో మాత్రమే కాదు పిల్లలలో కూడా పెరిగిపోయింది. ఈ మొబైల్‌ వాడకం కేవలం అలవాటుగా కాకుండా.. ఒక భయంకరమైన డ్రగ్ లాంటి వ్యసనంగా మారుతోందని వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.

చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు ఏడుస్తున్నారనో లేదా అన్నం తినడం లేదనే కారణంతోనో యూట్యూబ్ లో వీడియోలు చూపించి పిల్లలు ఏడుపు మాన్పించడం, అన్నం తినిపించడం వంటివి చేస్తుంటారు. ఇలా చేస్తే పిల్లల మెదడును మొద్దుబార్చే ‘డోపమైన్’ డ్రగ్‌ను వారికి అలవాటు చేస్తున్నట్లే! అంటున్నారు నిపుణులు. స్మార్ట్‌ఫోన్ వాడకం వల్ల పిల్లల నరాల వ్యవస్థ ఎలా నాశనమవుతుందో వైద్యుల హెచ్చరిస్తున్నారు.

మెదడులో జరిగే ‘డోపమైన్’ మాయాజాలం మొబైల్ స్క్రీన్ చూస్తున్నప్పుడు లేదా అందులో రకరకాల రీల్స్, వీడియోలు స్క్రోల్ చేస్తున్నప్పుడు మన నరాల వ్యవస్థలో ‘డోపమైన్’ (Dopamine) అనే రసాయనం విడుదలవుతుంది. దీన్నే సైన్స్ భాషలో ‘హ్యాపీ హార్మోన్’ అంటారు. ఈ హార్మోన్ వల్ల కలిగే అనర్థాలు ఏమిటో తెలుసుకుందాం.

క్షణికమైన ఆనందం

ఈ హార్మోన్ విడుదలైనప్పుడు మెదడుకు అమితమైన సంతోషం, తృప్తి కలుగుతాయి. ఈ క్షణికమైన డిజిటల్ ఆనందానికి పిల్లల మెదడు చాలా త్వరగా బానిస అయిపోతుంది.

ఒక్కసారిగా కోపం, చిరాకు

పిల్లలు ఫోన్ చూస్తూ ఆ హ్యాపీ హార్మోన్ ఎఫెక్ట్‌లో ఉన్నప్పుడు.. ఎవరైనా మధ్యలో అడ్డు వచ్చినా లేదా చేతిలో ఫోన్ లాక్కున్నా వారికి విపరీతమైన కోపం వస్తుంది. ఎందుకంటే ఫోన్ దూరం కాగానే డోపమైన్ విడుదల ఒక్కసారిగా ఆగిపోతుంది. ఆ అసంతృప్తిని, వెలితిని చిన్న పిల్లల మెదడు అస్సలు తట్టుకోలేదు. అందుకే వస్తువులను విసిరేయడం, గట్టిగా అరుస్తూ ఏడవడం లాంటివి చేస్తారని నిపుణులు చెబుతున్నారు.

నిద్రమాత్రలు, మత్తు పదార్థాలతో సమానం

వైద్య నిపుణుల పరిశోధనల ప్రకారం.. ఒక చిన్న బిడ్డకు తీవ్రమైన నిద్రమాత్రలు లేదా గంజాయి, హెరాయిన్ లాంటి మత్తు పదార్థాలు ఇస్తే వారి నరాల వ్యవస్థ ఎంతలా దెబ్బతింటుందో.. మొబైల్ స్క్రీన్‌కు అలవాటు పడిన పిల్లల మెదడు కూడా అదే స్థాయిలో మొద్దుబారిపోతుందట.

సామాజిక దూరం

ఈ డిజిటల్ మత్తు వల్ల పిల్లలు చుట్టూ ఉన్న సమాజంతో కలవడానికి, కనీసం కన్నవారితో మాట్లాడటానికి కూడా ఇష్టపడరట. ఒంటరితనానికి అలవాటు పడిపోతారని సూచిస్తున్నారు నిపుణులు.

అమితమైన బద్ధకం

శారీరక శ్రమ ఉండే ఆటలు ఆడకపోవడం వల్ల ఎప్పుడూ బద్ధకంగా, నిస్సత్తువగా మారిపోతారు. వీరికి చదువుపై శ్రద్ధ తగ్గడమే కాకుండా.. ఆలోచించే విధానం, సృజనాత్మకత పూర్తిగా నశించిపోతాయి.

ఇంకా కావాలనే కోరిక

స్క్రీన్ ద్వారా లభించే ఆనందం సరిపోక.. ఇంకా ఎక్కువ సమయం ఫోన్ లోనే గడపాలనే కోరిక పెరిగిపోయి పూర్తిగా స్మార్ట్‌ఫోన్‌కే అంకితమైపోతారు (Smartphone Addiction).

స్మార్ట్‌ఫోన్ అనేది ఒక సమాచార సాధనమే అయినప్పటికీ, అది పిల్లల మానసిక ఎదుగుదలను తొలచేసే సైలెంట్ కిల్లర్‌లా మారుతోంది. అందుకే చిన్నతనం నుంచే పిల్లల చేతికి ఫోన్లు ఇవ్వడం పూర్తిగా బంద్ చేయాలని, వారికి ప్రకృతిని, మైదానాల్లో ఆడే ఆటలను పరిచయం చేయడం ఎంతో అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Read Also: వంట నూనె కూడా ఎక్స్‌పైర్ అవుతుందా? గుర్తించే లక్షణాలు ఇవే!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>