Mobile Popup Ad
Mobile Popup Ad

ఎక్సైజ్ కానిస్టేబుల్‌ని నడిరోడ్డుపై హింసిస్తున్నభర్త

కలం, వెబ్ డెస్క్ : కాకినాడ (Kakinada) జిల్లా సామర్లకోట (Samarlakota) మండలం పి.వేమవరం గ్రామంలో కుటుంబ కలహం వివాదాస్పదంగా మారింది. ఎక్సైజ్ కానిస్టేబుల్‌ (Excise Constable) గా పనిచేస్తున్న దేవిపై ఆమె భర్త మణికంఠ విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దేవి తెలిపిన వివరాల ప్రకారం, 2021లో తాను, మణికంఠ ప్రేమ వివాహం చేసుకున్నామని.. ఇటీవల తన మేనకోడలిని రెండో పెళ్లి చేసుకోవాలని భర్త ప్రయత్నిస్తున్నట్లు ఆమె తెలిపింది. ఈ విషయంపై ప్రశ్నించగా మణికంఠ తనపై దాడి చేసి కింద పడేసి కొట్టాడని దేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. తనకు న్యాయం చేయాలని కోరుతూ దేవి సర్పవరం (Sarpavaram) పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read Also: తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా యాదాద్రి దర్శనం

Follow Us On: Facebook

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>