Mobile Popup Ad
Mobile Popup Ad

బ్యాటర్ సత్తా అప్పుడే తెలుస్తుంది: అశ్విన్

టెస్ట్‌ మ్యాచ్‌ల్లో భారత్ సాధిస్తున్న వరుస పరాజయాలపై టీమిండియా మాజీ స్పిన్నర్ అశ్విన్(Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియా బ్యాటర్లు డిఫెన్స్ ఆడటం మర్చిపోయారంటూ ఘాటుగా స్పందించాడు. ఒక బ్యాటర్ సత్తా తన డిఫెన్స్‌లోనే తెలుస్తుందని, కానీ ఇప్పటి బ్యాటర్లకు డిఫెన్స్ రావడం లేదని అన్నాడు. బాటర్ల వైఫల్యం వల్లే భారత్ టెస్ట్ మ్యాచ్‌లలో ఓడిపోతోందని అన్నాడు. ఇండియా బ్యాటర్ల బ్యాటింగ్ చాలా పేలవంగా ఉందని, మన వాళ్లు స్వీప్ షాట్స్ సరిగా ఆడటం లేదని తాను 3-4 ఏళ్లుగా చెబుతున్నానని అశ్విన్ చెప్పారు.

దక్షిణాఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్ బౌలింగ్‌లో భారత బ్యాటర్లు ఎంత బాగా డిఫెన్స్ చేశారు? అని అశ్విన్ ప్రశ్నించాడు. డిఫెన్స్ ఆడటంతో లోపాలు ఉంటే షాట్లు ఆడటానికి ప్రయత్నిస్తారని, దానికి బిగ్ హిట్టింగ్ చేయడం తమ ఆటతీరని కలరింగ్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. కానీ ప్రతి బ్యాటర్ కూడా డిఫెన్స్ ఆడాలని, డిఫెన్స్‌లోనే ఒక బ్యాటర్ సత్తా తెలుస్తుందని చెప్పాడు. ప్రస్తుతం స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే జట్లలో భారత్ అట్టడుగున ఉందని చెప్పుకొచ్చాడు. ఇప్పటికి అయినా టీమిండియా బ్యాటర్లు తమ డిఫెన్స్‌పై కసరత్తు చేయాలని Ashwin సూచించాడు.

Read Also: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ లాకప్‌డెత్..?

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>