సీఎం రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలి : బీజేపీ నాయకుల డిమాండ్

కలం, బాసర : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హిందువులపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బాసర మండల కేంద్రంలో బీజేపీ (BJP Protest)  నాయకులు బుధవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా మండల అధ్యక్షుడు సాయినాథ్ పటేల్ మాట్లాడుతూ.. దేవుళ్లను పేద, ధనిక దేవుళ్లుగా విభజిస్తూ ముఖ్యమంత్రి మాట్లాడటం సరికాదని చెప్పారు. ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో ముస్లిం ఓటు బ్యాంకును ఆకట్టుకునేందుకే కాంగ్రెస్‌ పార్టీ ఇటువంటి రాజకీయాలకు తెరలేపిందని ఆరోపించారు. సీఎం వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ, హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు గంగాధర్, లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ రాజేశ్వర్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు మనోహర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>