మృతుడి కుటుంబానికి నిత్యావసర వస్తువుల అందజేత

కలం, మక్తల్: నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని కర్ని (Karni) గ్రామానికి చెందిన కమ్మరి బలరాం ఆచారి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. బలరాం ఆచారిది నిరుపేద కుటుంబం కావడంతో అతడిపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న భార్యా పిల్లలు రోడ్డున పడే పరిస్థితి నెలకొన్నది. ఈ విషయం తెలుసుకున్న విశ్వబ్రాహ్మణ సంఘం మక్తల్ మండల అధ్యక్షుడు కృష్ణయ్య ఆచారి విషయాన్ని తమ సంఘం పెద్దల దృష్టికి తీసుకురావడంతో ఇటీవల అంత్యక్రియల నిమిత్తం రూ.18,300 ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ క్రమంలో మక్తల్ పట్టణానికి చెందిన రవి ట్రేడర్స్ నిర్వాహకులు మాజీ ఎంపీటీసీ నరేందర్ ఆచారి, రవి కుమార్ ఆచారి లు మంగళవారం బలరాం ఆచారి కుటుంబాన్ని పరామర్శించి, మానవత దృక్పథంతో స్పందించి బలరాం ఆచారి కుటుంబానికి ఒక నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను అందజేశారు. బలరాం ఆచారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో దత్తురామ్, చక్రధర్, గాసం నరసింహ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>