కలం, వెబ్‌డెస్క్: కొత్త ఏడాదిలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ విత్ డ్రా (EPFO) కు సంబంధించి కొన్ని మార్పులు, చేర్పులు అమలుకానున్నాయి. నిరుడు ఈపీఎఫ్‌వో రూపొందించిన కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్ట్రీ ఆమోదంతో 2025 అక్టోబర్‌లో వీటికి ఆమోదం లభించింది. విత్ డ్రాలను సులభతరం చేయడం, డిజిటల్ ప్రక్రియలను వేగవంతం చేయడం, పదవీ విరమణ భద్రత కాపాడడం లక్ష్యంగా వీటిని రూపొందించారు.
ఏడాది సర్వీస్ తప్పనిసరి..:
సాధారణంగా ఉద్యోగి, సంస్థ తరఫున జమ అయిన పీఎఫ్ మొత్తంలో 75శాతం మాత్రమే (ఎలిజబుల్ బ్యాలెన్స్) విత్ డ్రా (EPFO) చేసుకోవచ్చు. మిగిలిన 25 శాతం పదవీ విరమణ ప్రయోజనాల కోసం కచ్చితంగా పీఎఫ్ అకౌంట్లో ఉంచాల్సిందే. విత్ డ్రా కోసం ఇంతకుముందు 13 కారణాలు ఉండగా, ఇప్పుడు వాటిని మూడు విభాగాలుగా చేశారు. కేటగిరీ–1లో సామాజిక భద్రత కింద ఆరోగ్యం, చదువు, పెళ్లి; కేటగిరీ –2లో గృహావసరాలు(నిర్మాణం/కొనడం/హోమ్‌లోన్/రెనోవేషన్); కేటగిరీ–3లో ప్రత్యేక పరిస్థితులు చేర్చారు.
కొత్త నిబంధనల ప్రకారం ఎలిజబుల్ బ్యాలెన్స్ వంద శాతం విత్ డ్రా చేసుకోవాలంటే ఏడాది సర్వీస్ తప్పనిసరి. ఇది అన్ని కేటగిరీలకూ వర్తిస్తుంది. ఆరోగ్యావసరాలకు ఒక ఆర్థిక సంవత్సరంలో మూడు సార్లు విత్ డ్రా చేసుకోవచ్చు. మొత్తం సర్వీస్‌లో గరిష్ఠంగా చదువుకు పది, వివాహానికి ఐదు, గృహావసరాలకు ఐదు సార్లు తీసుకోవచ్చు. ప్రత్యేక పరిస్థితులలో (ఏ కారణంగా చెప్పకుండా) ఒక ఆర్థిక సంవత్సరంలో మూడు సార్లు విత్ డ్రాకు అవకాశం ఉంటుంది. ఇక పదవీ విరమణ, శాశ్వత వైకల్యం, వీఆర్ఎస్, శాశ్వతంగా దేశాన్ని వదిలి వెళ్లడం వంటి సందర్భాల్లో పూర్తి విత్ డ్రా చేసుకోవచ్చు.
Read Also: ‘SIR’ ఎఫెక్ట్.. యూపీలో 2.8 కోట్ల ఓట్లు తొలగింపు
Follow Us On: Instagram


