కలం, వెబ్ డెస్క్: ఓ తండ్రికి తన పిల్లలే ప్రపంచం. వారి ఆకలి తీర్చడం, అడిగినవి కొనివ్వడంలోనే ఆనందాన్ని వెతుక్కుంటాడు. కానీ ‘నాన్నా, ఆకలేస్తోంది.. అది కొనివ్వు’ అని పిల్లలు ఎంతో ఆశగా అడిగినప్పుడు, చేతిలో చిల్లిగవ్వ లేకపోతే తండ్రి హృదయం ముక్కలైపోతుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఓ వీడియో (Emotional Video) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన అసమర్థతను చూసి తానే కుమిలిపోతాడు. కళ్ళలో నీళ్లు తిరుగుతున్నా బాధను అనుభవిస్తాడు. గుండె నిండా భారంతో మౌనంగా ఉండిపోయే ఆ తండ్రి పడే బాధను వర్ణించలేం. బిడ్డల ఆకలిని తీర్చలేని నిస్సహాయ స్థితిలో ఆయన లోలోపల పూర్తిగా కుప్పకూలిపోతాడు. ప్రస్తుతం ఈ వీడియో ఎంతోమంది మనసులను కదిలించింది. ’అయ్యోపాపం.. ఎంత కష్టమొచ్చింది‘ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
-గుండెల్ని పిండేస్తున్న వీడియో
-కన్నబిడ్డల ఆకలి తీర్చలేని నిస్సహాయత.. కన్నీరు పెట్టిస్తున్న తండ్రి ఆవేదన!
“A Father’s Silent Heartbreak: The Pain of Being Unable to Feed His Children Goes Viral”#EmotionalVideo #Heartbreaking #FatherLove #ViralVideo #Fatherhood #Kalam… pic.twitter.com/4SGqMRD5qL— Kalam Daily (@kalamtelugu) May 4, 2026
Read Also: ట్రక్కును ఢీకొట్టిన విమానం.. వైరల్ అవుతున్న వీడియో
Follow Us On: Instagram

