Mobile Popup Ad
Mobile Popup Ad

అధికారుల సాహసం.. ప్రాణాలకు తెగించి విద్యుత్ పునరుద్ధరణ

కలం, జనగామ: సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు అంటే సక్రమంగా పనిచేయరు. ఆఫీసులకు పరిమితం అవుతారనే విమర్శలుంటాయి. కానీ జనగామ (Jangaon) జిల్లాలో ఇద్దరు విద్యుత్ ఉద్యోగులు చూపిన తెగువ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జిల్లాలోని యశ్వంతపూర్ సమీపంలోని చెరువు మధ్యలో ఉన్న విద్యుత్ లైన్లలో లోపం ఏర్పడింది. విద్యుత్ సమస్య పరిష్కారం కావాలంటే ఈత కొట్టి రిపేర్ చేయాల్సిందే. సరిగ్గా అదే పనిచేశారు ఓ ఇద్దరు ఉద్యోగులు.

జనగామ (Jangaon) రూరల్ సెక్షన్ పరిధిలోని యశ్వంతపూర్ ప్రాంతంలో 11 కేవీ ఏజీఎల్ (11 KV AGL) లైన్ బ్రేక్ డౌన్ అయింది. దీంతో సమీప ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. యశ్వంతపూర్ చెరువు మధ్యలోని విద్యుత్ స్తంభాల వద్ద సమస్య ఉందని గుర్తించారు. చెరువు పూర్తిగా నిండిఉండటంతో రిపేర్ చేయడం కష్టసాధ్యంగా మారింది. ఈ క్రమంలో ఉద్యోగులు (ఏఎల్ఎం) పూర్ణచందర్, కట్టర్ కుమార్ లు కఠిన నిర్ణయం తీసుకున్నారు. చెరువులోకి దిగి ఈదుకుంటూ వెళ్లి లోపాన్ని సరిచేశారు. విధి నిర్వహణలో నిబద్ధతను చాటుకున్న పూర్ణచందర్, కట్టర్ కుమార్‌లను స్థానికులు ప్రశంసలతో ముంచెత్తారు.

Read Also: బాక్సాఫీస్ ప్రభంజనం.. రూ.1500 కోట్ల క్లబ్‍లో ‘దురంధర్-2’

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>