బాక్సాఫీస్ ప్రభంజనం.. రూ.1500 కోట్ల క్లబ్‍లో ‘దురంధర్-2’

కలం, వెబ్ డెస్క్ : రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2: ది రివెంజ్’ (Dhurandhar 2) బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. మార్చి 19న విడుదలైన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ భారీ వసూళ్లు రాబడుతోంది. సినిమా రిలీజై దాదాపు రెండు వారాలు గడుస్తున్నా హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఈ మూవీ థియేటర్ల వద్ద రచ్చ చేస్తోంది. ఈ క్రమంలో ఈ సినిమా రెండు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1501 కోట్లు(గ్రాస్) వసూలు చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి రూ.1134 కోట్లు కాగా, ఓవర్సీస్ ద్వారా రూ. 364 కోట్లు వచ్చాయి. ఇప్పటి వరకు భారత్ లో రూ. 937.32 కోట్ల నెట్ వసూళ్లను ఈ మూవీ రాబట్టింది. దీంతో భారత్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ సినిమా కంటే ముందు దంగల్, బాహుబలి-2, పుష్ప-2 తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

ఓవరాల్ కలెక్షన్లలో కూడా ‘ధురంధర్ 2 (Dhurandhar 2): ది రివెంజ్’ మూవీ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా ‘దంగల్‌’ (రూ.2,024 కోట్లు) రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో ‘బాహుబలి2’ (రూ.1,810 కోట్లు), ‘పుష్ప2’(రూ.1,800 కోట్లు) ఉన్నాయి. మరి రానున్న రోజుల్లో ఈ క్రేజీ మూవీ ఆయా మూవీలను దాడుతుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ‘ధురంధర్ 2: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి లెక్కలు సెట్ చేస్తోందో వేచి చూడాలి.

Read Also: చంద్రుడి చెంతకు నలుగురు వ్యోమగాములు.. వీడియో విడుదల

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>