యధావిధిగా విద్యుత్తు పునరుద్ధరణ

కలం, బోనకల్: మురసు తుఫాను కారణంగా నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా మధిర (Madhira) 132 కెవి నుండి బోనకల్ (Bonakal), మోటమర్రి, సిరిపురం సబ్ స్టేషన్ కి విద్యుత్తు సరఫరా చేసే ప్రధాన విద్యుత్ స్తంభం విరిగిపడటంతో…. విద్యుత్ అంతరాయం లేకుండా ఉండుటకు ప్రత్యామ్నాయంగా పెద్దగోపతి నుండి విద్యుత్ సరఫరా చేయనైనది.

బుధవారం ఈ మూడు సబ్ స్టేషన్లకు సరఫరా చేసే విద్యుత్ స్తంభాన్ని, లైన్లను విద్యుత్ శాఖ అధికారుల స్వీయ పర్యవేక్షణలో సిబ్బంది పునరుద్ధరించి యధావిధిగా మధిర 132 కెవి నుండి విద్యుత్ సరఫరా కొనసాగించారు. ఈ కార్యక్రమంలో మధిర డివిజన్ డి ఈ బండి శ్రీనివాసరావు, మధిర ఏడిఈ అనురాధ, బోనకల్ ఏడీఈ ఆనంద్, మధిర రూరల్ సెక్షన్ ఏఈ మైథిలి, కలకోట ఏఈ మోహన్ మరియు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>