కలం, నిర్మల్ : రాష్ట్రస్థాయి పీఎం శ్రీ అండర్ -17 కబడ్డీ పోటీలకు నిర్మల్ ( Nirmal) జిల్లా నుంచి ఎంపికైన విద్యార్థినీ, విద్యార్థులు బుధవారం హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. ఈ నెల 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లోని పోలీస్ అకాడమీలో ఈ పోటీలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ తరఫున ఎంపికైన క్రీడాకారులకు స్పోర్ట్స్ యూనిఫామ్‌లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సెక్టోరల్ అధికారి నరసయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాస్, అంబాజీ, రమణారావు, పోశెట్టి, దేవేందర్, జమున, రాధిక పాల్గొన్నారు.

