కలం, వెబ్ డెస్క్ : ఎస్ఐఆర్ పై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) గడువు మరింత పెంచుతున్నట్టు ప్రకటించింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, కేరళ, బెంగాల్ లో ఎస్ఐఆర్ గడువును వారం రోజులపాటు పెంచింది. ఆయా రాష్ట్రాల ఎన్నికల సంఘం వినతుల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే, 12 రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియను ఇప్పటికే ఏడు రోజుల పాటు ఎన్నికల సంఘం (ECI) పొడిగించింది. మరోసారి ఇవాళ ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణకు గడువు పెంచింది. ప్రస్తుతం ఓటర్ల జాబితా సవరణ రెండో దశ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఛత్తీస్ గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బెంగాల్‌లో కొనసాగుతోంది.
Read Also: బిహార్లోని సీతామర్హిలో ఎయిడ్స్ కలకలం
Follow Us On: Instagram


