ఆస్తి వివాదం.. వృద్ధ దంపతులు, ఇద్దరు మనవళ్ల హత్య

కలం, వెబ్ డెస్క్: ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లో జాంజ్‌గిర్-చాంపా జిల్లా భవతరా గ్రామంలో జరిగిన దారుణం జరిగింది. ఆస్తి వివాదంతో వృద్ధ దంపతులు, ఇద్దరు మనవళ్లను ఘోరంగా హత్య చేశారు. ఆస్తి మొత్తం తమకే దక్కాలన్న దురాశతో తోడబుట్టిన వారి పిల్లలను కూడా దుర్మార్గులు వదలలేరు. నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో కుమారుడు సోన్సాయ్, మనవడు డాకేశ్వర్ నరికి చంపారు. మృతులు మేదినీ ప్రసాద్ కశ్యప్ (70), కాంతి బాయి (65), పీతాంబర్ (17), మోగ్రా (25)గా గుర్తించారు. నిందితుడు సోన్సాయ్ గతంలో ఒక సోదరుడిని చంపి 15 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. తండ్రీకొడుకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>