కల్యాణ లక్మి, షాదీ ముబారక్ పథకాలు బంద్!: మంత్రి క్లారిటీ

కలం, వెబ్ డెస్క్ : కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎత్తివేయలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ( Minister Ponnam)  అన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న నిరసన ప్రదర్శనపై మంత్రి ఫైర్ అయ్యారు. రాజకీయ దురుద్దేశంతోనే బీఆర్ఎస్ నిరసనలు చేపడుతుందని విమర్శించారు. ఈ విషయంపై బీఆర్ఎస్ మొసలి కన్నీరు కారుస్తుందని మండిపడ్డారు. రాజకీయ కుట్రలో భాగంగానే కొందరు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టులో కేసు వేశారని చెప్పారు.

ఈ అంశంపై హైకోర్టు విధించిన స్టే ఎత్తివేసేలా చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వం తరుఫున ఎలాంటి నిర్లక్ష్యం లేదని.. కోర్టుకు అన్ని ఆధారాలు సమర్పిస్తామని వ్యాఖ్యానించారు.  కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ స్కీమ్‌లను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాజకీయ దురుద్దేశంతో బీఆర్ఎస్ చేస్తున్న నిరసనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>