ములుగు జిల్లాలో దారుణం.. మనవరాలిపై లైంగిక దాడి, 4 నెలల గర్భం

కలం, ములుగు: సమాజం తలదించుకునే దారుణ ఘటన ములుగు (Mulugu) జిల్లా వాజేడు మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన మనవరాలైన 14 ఏళ్ల మైనర్ బాలికపై సొంత తాత పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. చిన్ననాటి నుంచి తన ఆలనాపాలన చూసుకున్న వ్యక్తే కామాంధుడిగా మారి బాలిక జీవితాన్ని చిదిమివేశాడు. ప్రస్తుతం ఆ బాలిక నాలుగు నెలల గర్భంతో ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. పోలీసుల వివరాల ప్రకారం.. వాజేడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరిస్తూ పలుమార్లు దారుణానికి ఒడిగట్టినట్లు బాలిక తెలిపినట్లు సమాచారం. ఇటీవల బాలిక ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆమెను కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించగా, బాలిక నాలుగు నెలల గర్భవతి అని నిర్ధారించారు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు బాలికను ప్రశ్నించగా, తనపై తాతే లైంగిక దాడికి పాల్పడ్డాడని కన్నీటి పర్యంతమై చెప్పినట్లు తెలిసింది.

ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

Read Also: లైంగిక వేధింపుల కేసు: హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>