నెల రోజుల్లో అందుబాటులోకి టౌన్ హాల్: కలెక్టర్

కలం, వనపర్తి: వనపర్తి పట్టణంలోని పాత మార్కెట్ యార్డులో నిర్మించిన టౌన్ హాల్‌లో మిగిలిన పనులను నెల రోజుల్లో పూర్తి చేసి ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి (Collector Adarsh Surabhi) అధికారులను ఆదేశించారు. శుక్రవారం టౌన్ హాల్‌ను పరిశీలించిన కలెక్టర్, ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్‌తో సమావేశమై పెండింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. టౌన్ హాల్‌లో సౌండ్ ప్రూఫింగ్ పనులు వచ్చే నెలలోగా పూర్తిచేయడంతో పాటు ఫర్నిచర్ ఏర్పాటు, భవనం పరిసరాల్లో పచ్చదనం, పారిశుద్ధ్య పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సూచించారు.

అన్ని పనులను నాణ్యతతో పూర్తి చేసి నెల రోజుల్లో టౌన్ హాల్‌ను పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. రాబోయే మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని కొత్త టౌన్ హాల్‌లో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలో పూర్తయిన పలు అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు. పాత యూకో బ్యాంకు సమీపంలో, జిల్లా గ్రంథాలయ ఆవరణ వద్ద నిర్మించిన డ్రైనేజీ పనులు, సూర్య చంద్ర పాఠశాల రోడ్డులో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణాల నాణ్యతను తనిఖీ చేసి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మాధవి, మున్సిపల్ కమిషనర్ నిరంజన్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>