హై టెన్షన్.. ప్రయాణికులను మళ్లీ ఇబ్బందిపెట్టిన ఇండిగో!

కలం, వెబ్ డెస్క్ : గత ఏడాది ఇండిగో కార్యకలాపాల్లో తీవ్ర అంతరాయంతో దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మరోసారి ఇండిగో విమానం (Indigo Flight) వల్ల ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. ఈ సారి సాంకేతిక సమస్యల వల్ల ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నం నుంచి తిరుపతికి బయలుదేరిన ఇండిగో విమానం (6E7063)లో అనుహ్యంగా సాంకేతిక సమస్య తలెత్తింది. టేకాఫ్ సమయంలో సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. సమస్యను గుర్తించిన పైలట్ వెంటనే విమానాన్ని రన్ వే పైనే నిలిపివేసి అధికారులకు సమాచారం అందించారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది.

కాగా, ఈ హఠాత్తు పరిణామంతో విమాన ప్రయాణికులు విమానాశ్రయంలోనే ఉన్నారు. ప్రయాణం ఆలస్యం కావడంతో పాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై స్పష్టత లేదంటూ ఇండిగో (Indigo Flight) యాజమాన్యంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాసేపు విశాఖ విమానాశ్రయంలో గందరగోళ వాతావరణం నెలకొంది. అయితే ఈ ఘటనపై ఇండిగో యాజమాన్యం స్పందించింది. సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు ఇంజనీర్లు బృందం తీవ్రంగా శ్రమిస్తుందని వెల్లడించింది.

Read Also: విజయ్‌కు బిగ్ షాక్‌.. ఎన్నికల ముందే ఒక సీటు కోల్పోయిన టీవీకే

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>