Mobile Popup Ad
Mobile Popup Ad

పలువురు పార్టీ నేతలపై మంత్రి లోకేశ్ సీరియస్

కలం, వెబ్ డెస్క్: తమ పార్టీ (TDP) సమీక్షా సమావేశంలో పలువురు నేతలపై టీడీపీ నేత, మంత్రి లోకేశ్ (Lokesh) సీరియస్ అయ్యారు. గత నాలుగు వారాలుగా క్యాడర్ సమావేశాలు, గ్రీవెన్స్ నిర్వహించని నేతలపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే చైతన్యరెడ్డి, పులివెందుల ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి, ధర్మవరం ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్‌పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలు (Party Meetings) నిర్వహించకపోవడానికి కారణాలు అడిగి తెలుసుకోవాలని పార్టీ కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పార్టీ కార్యక్రమాలు ఖచ్చితంగా నిర్వహించాలని.. ఇకపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని మంత్రి స్పష్టం చేశారు.

Read Also: హై టెన్షన్.. ప్రయాణికులను మళ్లీ ఇబ్బందిపెట్టిన ఇండిగో!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>