బంగ్లాదేశ్‌లో భారీ భూకంపం..

బంగ్లాదేశ్‌(Bangladesh) రాజధాని ఢాకాను భారీ భూకంపం కుదిపేసింది. ఢాకాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సింగ్దీ దగ్గర ఈ భూకంపం కేంద్రీకృతమైంది. ఈ భూకంప తీవ్రత రెక్టార్ స్కేల్‌పై 5.5 గా నమోదయిందని అమెరికా జియాలజికల్ సర్వే (USGS) తెలిపింది. భూకంపం సుమారు 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. భూమి కంపించడంలో భవనాల్లోని ప్రజలంతా బయటకు పరుగులు పెట్టారు. కాగా ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టంనమోదు కాలేదు.  ఢాకాలో జరుగుతున్న బంగ్లాదేశ్–ఐర్లాండ్ టెస్ట్ మ్యాచ్ కూడా భూకంపం కారణంగా కొద్దిసేపు ఆగిపోయింది.

బంగ్లాదేశ్‌(Bangladesh)తో పాటు భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా శుక్రవారం ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. కోల్‌కతాలో ఉదయం 10:10 గంటల సమయంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. అంతేకాకుండా గువహటి, అగర్తల, శిల్లాంగ్‌లలో కూడా భూమి కంపించిందని నివేదికలు చెబుతున్నాయి.

Read Also: అమెరికాకు విదేశీ ఉద్యోగులు కావాలి: ట్రంప్

Follow Us on : ShareChat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>