కలం డెస్క్ : రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన విజన్ డాక్యుమెంట్ (Vision Document) ప్రాక్టికల్‌గా ఉన్నదని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు (Duvvuri Subbarao) అన్నారు. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే ఏటా సగటున 8-9% వృద్ధి రేటు సాధించాల్సి ఉంటుందన్నారు. దేశంలో అతి కొత్త రాష్ట్రమే అయినప్పటికీ ఆర్థిక వృద్ధి రేటు గణనీయంగా ఉన్న రాష్ట్రాల సరసన నిలిచిందన్నారు.
ఇప్పటికే హైదరాబాద్ సిటీ ఒక ఐకానిక్ (Iconic City) నగరంగా గుర్తింపు పొందిందన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT), ఫార్మా (Pharma), బయో టెక్నాలజీ (Bio Technology) రంగాల్లో హైదరాబాద్ ఒక హబ్‌గా నిలిచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్‌తో రాష్ట్ర అభివృద్ధి అన్ స్టాపబుల్ (Unstoppable) మాత్రమే కాక అన్ బీటబుల్ (Unbeatable) కూడా అని అన్నారు. గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా ప్రభుత్వం విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్‌పై మాట్లాడుతూ Duvvuri Subbarao పై వ్యాఖ్యలు చేశారు.
Read Also: రాష్ట్రాభివృద్ధికి సాయుధ పోరాటమే స్ఫూర్తి
Follow Us On: X(Twitter)


