లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ

కలం, వరంగల్ బ్యూరో: వారసత్వ భూమికి సంబంధిత ఫైల్ పరిష్కారం కోసం రూ.10 వేల లంచం తీసుకుంటున్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ (Revenue Inspector) రాంబాబును ఏసీబీ (ACB) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివ‌రాల్లోకి వెళ్తే.. దుగ్గొండి (Duggondi) మండలంలోని మధిర గ్రామానికి చెందిన లొల్లాటి రాజు తండ్రి నర్సయ్య మరణించాడు. తన తండ్రి పేరు మీద ఉన్న 27 గుంటల వ్యవసాయ భూమిని పట్టా చేసుకునేందుకు వారసత్వ భూమి నమోదు ప్రక్రియ కోసం రాజు దరఖాస్తు చేసుకున్నాడు. సంబంధిత ఫైల్‌ను ప్రాసెస్ చేసేందుకు ఆర్‌ఐ రాంబాబు రూ.10 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు పక్కా ప్రణాళికతో గురువారం తహసీల్దార్ ఆఫీస్ పై దాడి చేశారు. తహసీల్దార్ కార్యాలయంలోనే లంచం తీసుకుంటుండగా రాంబాబుని అదుపులోకి తీసుకున్నారు. నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>