కలం, మెదక్ బ్యూరో : ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించారని, దుబ్బాక (Dubbak) మున్సిపాలిటీలోని సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ, ప్రతి వార్డులో అభివృద్ధి పనులు వేగవంతం చేసి దుబ్బాకను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy) తెలిపారు. దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో నూతన పాలకవర్గం తొలి సర్వసభ్య సమావేశంకు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
దుబ్బాక(Dubbak) పట్టణంలోని సమస్యలపై నూతన పాలకవర్గం, అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీరామ్ సంగీత రవీందర్, వైస్ చైర్‌పర్సన్ సులోచన స్వామి, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్‌లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

