తెలంగాణ అవయవదాతల సంఘం అధ్యక్షుడిగా లయన్ నటరాజు

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : మహబూబ్‌నగర్‌కు (Mahbubnagar) చెందిన ప్రముఖ సామాజిక సేవకుడు, రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ లయన్ అంబటి నటరాజు‌కు (Ambati Natraj) రాష్ట్ర స్థాయి కీలక బాధ్యత లభించింది. సావిత్రిబాయి ఫూలే విద్యా చారిటబుల్ ట్రస్ట్ అనుబంధ విభాగమైన అఖిల భారత శరీర అవయవ దాతల సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఆయనను నియమించినట్లు ట్రస్ట్ చైర్‌పర్సన్ డాక్టర్ గూడూరు సీతా మహాలక్ష్మీ, మేనేజింగ్ ట్రస్టీ ప్రొఫెసర్ ఆనంద్ స్వరూప్ ప్రకటించారు.

ఈ సంస్థ విద్యా దానం లక్ష్యంగా అనాథ, నిరుపేద విద్యార్థుల విద్యాభివృద్ధికి చేయూతనివ్వడం, అలాగే ‘మరణించినా జీవించినా దానం చేయండి’ అనే నినాదంతో దేశవ్యాప్తంగా శరీర దానం, అవయవ దానంపై అవగాహన కల్పించడం లక్ష్యంగా పనిచేస్తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నేత్రదానం, అవయవదానంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నటరాజు సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నటరాజు (Ambati Natraj) మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సమాజ సేవా కార్యక్రమాలను మరింత విస్తరించి అవయవదానంపై ప్రజలలో  అవగాహన పెంచేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

Read Also: చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం: పొన్నం ప్రభాకర్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>