epaper
Monday, March 2, 2026
epaper

ఆ దేశాల నుంచి వలసలకు అమెరికా ఫుల్‌స్టాప్..

వలసల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కీలక నిర్ణయం తీసుకున్నారు. పేద దేశాల నుంచి అగ్రరాజ్యానికి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇటీవల వైట్ హౌస్ సమీపంలో కాల్పులు జరిగిన నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అమెరికా యంత్రాంగం ఇప్పటికే చర్యలు స్టార్ట్ చేసేసిందని చెప్పారు. అదే విధంగా అమెరికా పౌరులు కాని వారికి ఫెడరల్‌ బెనిఫిట్స్‌, ప్రభుత్వ సబ్సిడీలు నిలిపివేస్తామని వెల్లడించారు.

అమెరికా సాంకేతికంగా ముందుకు సాగుతున్నప్పటికీ ప్రస్తుత ఇమిగ్రేషన్‌ విధానాలు దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని ట్రంప్(Donald Trump) అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్రమంగా వచ్చిన లక్షల మంది అనుమతులను రద్దు చేస్తామని, దేశ భద్రతకు ముప్పు కలిగించే వారిని బహిష్కరిస్తామని హెచ్చరించారు. తిరోగమన వలస విధానంతోనే ఈ లక్ష్యాలను సాధించగలమని ఆయన వివరించారు.

Read Also: హైడ్రా విచారణకు హాజరైన ఎమ్మెల్యే నవీన్ యాదవ్

Follow Us On : Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!