epaper
Monday, February 2, 2026
spot_img
epaper

ఇండియా టుడే, ఇండియా గేట్ పై ట్రంప్ ఇంట్రెస్టింగ్ పోస్టు

కలం, డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి ఆసక్తికర పోస్టు చేశారు. ఇండియా టుడే కవర్ పేజీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోడీ ఫొోటలు వేసి.. ద మూవర్, ద షేకర్ అనే ట్యాగ్ లైన్స్ ఇచ్చారు. ఈ కవర్ ఫొటోను ట్రంప్ తన ట్రూత్ సోషల్ లో పోస్టు చేశారు.

అలాగే మరో పోస్టులో ఇండియా గేట్ ఫొటోను ‘ట్రూత్ సోషల్’ లో పోస్టు చేశారు ట్రంప్. ఇండియా గేట్ చారిత్రక కట్టడం అని.. చాలా సుందరమైంది అంటూ తెలిపారు. అమెరికాలో తాము ఇంత కన్నా గొప్పగా కడుతున్నాం అని చెప్పుకొచ్చారు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump). ఢిల్లీలోని ఇండియా గేట్ మన దేశంలోని చారిత్రక కట్టడాల్లో ఒకటి. ప్రస్తుతం అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వాషింగ్టన్ డీసీలో 250 అడుగుల భారీ నిర్మాణం చేపట్టేందుకు ట్రంప్ ప్లాన్ చేస్తున్నారంట.

త్వరలోనే దానిపై బిల్లు పెట్టే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇండియా గేట్ ను ఉద్దేశించి ట్రంప్ పోస్ట్ చేసి ఉంటారని సమాచారం. ఇండియాపై టారిఫ్‌ లు భారీగా వేస్తున్న ట్రంప్.. ఈ నడుమ ఇండియా మీద ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేస్తున్నాడు. ఇండియాతో స్నేహం కొనసాగించాలని ట్రంప్ భావిస్తున్నాడనే ప్రచారం కూడా ఉంది. అమెరికా త్వరలోనే టారిఫ్ లను తగ్గించే అవకాశం ఉందని ఆ దేశ ప్రతినిధులు చెబుతున్నారు. త్వరలోనే దానిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>