అమెరికా మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్ కీలక ప్రకటన!

కలం, వెబ్ డెస్క్ : అమెరికా మధ్యంతర ఎన్నికల వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) సంచలన ప్రకటన చేశారు. అమెరికా మధ్యంతర ఎన్నికల కంటే ముందు ఇరాన్‌పై ఎటువంటి సైనిక దాడులు ఉండవని వెల్లడించారు. ఈ మేరకు నవంబర్ 3 వరకు ఇరాన్ పై దాడులకు బ్రేక్ ఇచ్చారు. అయితే దాడులకు తాత్కాలిక విరామం ప్రకటించినప్పటికీ, ఇరాన్ ఎకానమీపై విధించిన ఆర్థిక ఆంక్షలు, నౌకా దిగ్బంధం పూర్తి స్థాయిలో కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా అంతర్జాతీయంగా కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా చమురు రవాణా భద్రత గురించి ట్రంప్ ప్రస్తావించారు. తాజా రాత్రి వేళల్లో ఈ వ్యూహాత్మక మార్గం గుండా రికార్డు స్థాయిలో 22 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా సజావుగా సాగిందని వెల్లడించారు. చమురు సరఫరా మార్గాల్లో భద్రత పునరుద్ధరణపై స్పందిస్తూ.. ఈ మార్గం ద్వారా నావిగేషన్ సురక్షితంగా సాగుతోందని, అయితే ఇరాన్ నుంచి చమురును ఎగుమతి కాకుండా తమ నౌకాదళం గట్టి నిఘా ఉంచిందని వివరించారు.

ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే క్రమంలో ఇరాన్ ప్రతినిధులతో చర్చలు పురోగతిలో ఉన్నాయని ట్రంప్ తెలిపారు. అయితే నిబంధనలు అతిక్రమిస్తే ఎన్నికల అనంతరం కఠిన చర్యలు ఉంటాయని పరోక్షంగా హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని సాధించకుండా నిరోధించడమే తమ ప్రాథమిక లక్ష్యమని ట్రంప్ పేర్కొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>