Mobile Popup Ad
Mobile Popup Ad

‘తెలంగాణ పబ్లిక్ స్కూలు’కు ఎంపికైన వలిగొండ ZPHS

కలం, వలిగొండ: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యను బలోపేతం నూతనంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ను తీసుకువచ్చింది. అందులో భాగంగా రావిరాలలో ఏర్పాటుచేసిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా కొన్ని స్కూల్స్‌ను తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ గా మార్చేందుకు ప్రభుత్వం ఎంపిక చేసింది. అందులో భాగంగా యాదాద్రి భువనగిరి వలిగొండ (Valigonda) మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ పాఠశాల అన్ని రకాలుగా ఏర్పాటుకు అవకాశం ఉండడంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ గా మార్చేందుకు ప్రభుత్వం సెలెక్ట్ చేసింది. కార్పొరేట్ తరహాలో అన్ని హంగులు, సౌకర్యాలతో ఏర్పాటు కావడంతో పేద విద్యార్థులకు అత్యుత్తమమైన విద్యను అందించేందుకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ లు ఉపయోగపడనున్నాయి.

పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం ప్రభుత్వం దాదాపు రూ.15 కోట్లు మేరకు నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాఠశాలకు కావాల్సిన మౌలిక వస్తువులతో పాటు సాంకేతిక వసతులు, లైబ్రరీ, ల్యాబ్ లు, స్పోర్ట్స్‌ కు అందుబాటులో ఉండనున్నాయి. తెలంగాణ పబ్లిక్ స్కూల్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే కార్పొరేట్ తరహాలో విద్య అందించే అవకాశం ఉండడంతో ప్రైవేటు పాఠశాలలకు ప్రాధాన్యత కూడా తగ్గే అవకాశం ఉంటుంది. వలిగొండ (Valigonda) ZPHS పబ్లిక్ స్కూల్ గా ఎంపిక కావడం పట్ల స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేసిన కృషికి విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>