టెహ్రాన్ టార్గెట్‌గా అమెరికా బాంబుల వర్షం.. సైనిక ఉన్నతాధికారులు మృతి!

కలం, వెబ్ డెస్క్: ఇరాన్ రాజధాని టెహ్రాన్ (Tehran) లక్ష్యంగా అమెరికా సైన్యం భీకర దాడులు నిర్వహించింది. ఈ మెరుపు దాడుల్లో ఇరాన్ సైన్యానికి చెందిన పలువురు కీలక నేతలు, ఉన్నతాధికారులు మరణించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా దాడులకు సంబంధించిన వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. అనాలోచితంగా వ్యవహరిస్తున్న ఇరాన్ సైనిక నాయకత్వం ఈ దాడిలో అంతమైందని పేర్కొన్నారు. మరణించిన అధికారుల పేర్లు, వారి హోదాలకు సంబంధించిన వివరాలను మాత్రం ట్రంప్ వెల్లడించలేదు. మరోవైపు, అమెరికా చేసిన ఈ భారీ దాడిపై ఇరాన్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>