Mobile Popup Ad
Mobile Popup Ad

డీసీఎం బీభత్సం.. దంపతులను కిలోమీటర్‌ ఈడ్చుకెళ్ళాడు!

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌‌లోని మాదాపూర్ పరిధిలో గతరాత్రి డీసీఎం బీభత్సం (DCM Truck Drags) సృష్టించింది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా ఆమె భర్త ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. రాత్రి మాదాపూర్ మైండ్ స్పేస్ వద్ద స్కూటీపై ఉన్న దంపతులను డీసీఎం డ్రైవర్‌ ఢీకొట్టి.. అలాగే కిలోమీటర్‌ మేర ఈడ్చుకెళ్లాడు. కొంతదూరం వెళ్లాక స్కూటీ పైనుంచి భర్త పక్కకు పడిపోవడంతో గాయాలయ్యాయి. స్కూటీపై ఉన్న భార్యను డీసీఎం డ్రైవర్‌ కిలోమీటర్‌ మేర ఈడ్చుకెళ్లాడు. అక్కడివారు వెంటనే అప్రమత్తమై వాహనాన్ని ఆపడంతో డ్రైవర్ పరారయ్యారు. డ్రైవర్ పారిపోగా.. క్లీనర్‌ దొరకడంతో స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దంతతులను అయేషా(22), అబ్దుల్ బాసిత్​గా గుర్తించారు. ప్రస్తుతం అబ్దుల్ బాసిత్ గచ్చిబౌలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సదరు దంపతులు మలబార్‌ గోల్డ్ షాప్ లో పనిచేస్తున్నారు. కూకట్‌పల్లిలో సినిమా చూసి మహేశ్వరం తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>