Mobile Popup Ad
Mobile Popup Ad

నేడు రంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

కలం, వెబ్ డెస్క్: రంగారెడ్డి (Rangareddy) జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా బుద్వేలులో నిర్మిస్తున్న నూతన హైకోర్టు భవన సముదాయానికి సంబంధించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యంగా రెండో దశ పనుల్లో భాగంగా న్యాయమూర్తుల క్వార్టర్ల నిర్మాణానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా హాజరై భూమిపూజ చేయనున్నారు. ఈ అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రితోపాటు సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టుకు చెందిన పలువురు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>