కలం, వెబ్ డెస్క్: తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. డీఎంకే కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) ప్రకటించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని కూడా పేర్కొంది. దీంతో రెండు పార్టీల మధ్య ఉన్న 60 ఏళ్ల బంధానికి ఎండ్ కార్డ్ పడినట్లయింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఏర్పడిన రాజకీయ పరిణామాలు, కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై జరిగిన చర్చలే డీఎంకే, IUML మధ్య విభేదాలకు కారణమైనట్లు తెలుస్తోంది. ఈ తాజా పరిణామంతో భవిష్యత్తులో తమిళనాడు రాజకీయ సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తోంది.
టీఎంకే ప్రభుత్వానికి మద్దతు..!
డీఎంకే కూటమి నుంచి వైదొలగిన IUML పార్టీ అధికార టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం లాంఛనంగా కనిపిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే విజయ్‌తో చర్చలు జరిపి.. హామీ లభించడంతోనే డీఎంకేకు కటీఫ్ చెప్పినట్లు సమాచారం. 1948లో ఏర్పాటైన ఈ పార్టీ కేరళ, తమిళనాడు రాజకీయాల్లో (Tamil Nadu Politics)కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. ముస్లిం సమాజ హక్కులు, విద్యా అవకాశాలు, సామాజిక న్యాయం కోసం పనిచేస్తుంటుంది. ఖదీర్ మొహిద్దీన్ ప్రస్తుతం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.
Read Also: 7 బుల్లెట్ ట్రైన్ కారిడార్లకు పచ్చజెండా: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
Follow Us On : WhatsApp

