కవి తాళ్ళ లక్ష్మీనారాయణ కుటుంబాన్ని పరామర్శించిన మహేష్​ కుమార్ గౌడ్

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లా ఎడపల్లి మండలం జానకంపేటలో ఇటీవల కన్నుమూసిన ప్రముఖ కవి, డాక్టర్ తాళ్ల లక్ష్మీనారాయణ గౌడ్ కుటుంబ సభ్యులను టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ తాళ్ల లక్ష్మీనారాయణ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన మహేష్ కుమార్ గౌడ్, కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ వారి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. డాక్టర్ తాళ్ల లక్ష్మీనారాయణ గౌడ్ వంటి గొప్ప కవిని కోల్పోవడం తెలుగు సాహిత్యానికి తీరని లోటని అన్నారు. సినారె వంటి మహోన్నత సాహిత్యవేత్తల సరసన నిలిచే ప్రతిభ ఉన్నప్పటికీ, ఆయనకు రావాల్సిన స్థాయి గుర్తింపు దక్కకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఆయన రచనలు, సాహిత్య సేవ చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు కేశ వేణు, శేఖర్ గౌడ్, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, రామకృష్ణ, దయాకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>