కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్, విశాఖపట్నంలో ఈడీ సోదాలు (ED Raids) కలకలం రేపుతున్నాయి. రూ.3,000 కోట్లకు పైగా భారీ చిట్‌ఫండ్స్ కుంభకోణం కేసులో ఈడీ అధికారులు ఏకకాలంలో 5 చోట్ల సోదాలు జరుపుతున్నారు. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీల ఆర్థిక లావాదేవీలపై మెయిన్ గా ఫోకస్ చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త, వైసీపీ మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ (Malla Vijayaprasad)కు చెందిన నివాసాలు, కార్యాలయాలపై ఉదయం నుంచి ఇరు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నారు.
స్థానిక అధికారులతో పాటు ప్రత్యేకంగా బిహార్‌కు చెందిన ఈడీ బృందాలు రంగంలోకి దిగి దాడులు చేస్తున్నాయి. చిట్‌ఫండ్స్ పేరుతో ప్రజల నుంచి వసూలు చేసిన నిధులను పెద్దఎత్తున దారి మళ్లించారనే ఆరోపణలు నేపథ్యంలో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో భాగంగా బ్యాంక్ ఖాతాలు, ల్యాప్‌టాప్‌లు, డిజిటల్ సాక్ష్యాలు, కీలక పత్రాలను పరిశీలిస్తున్నారు.
విజయప్రసాద్ గతంలో 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 2021లో ఏపీ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.

