గవర్నర్ సమక్షంలో ఘనంగా కాకతీయ యూనివర్సిటీ 24వ స్నాతకోత్సవం

కలం, హనుమకొండ: కాకతీయ విశ్వవిద్యాలయం (Kakatiya University) లో శనివారం 24వ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla) ముఖ్య అతిథిగా హాజరై స్నాతకోత్సవాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, పరిశోధకులకు గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్‌లు, బంగారు పతకాలను అందజేశారు. ఈ స్నాతకోత్సవంలో మొత్తం 408 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, పరిశోధనలు పూర్తిచేసిన 91 మంది స్కాలర్లకు డాక్టరేట్‌ పట్టాలను ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాట్లాడుతూ.. పట్టాలు అందుకున్న విద్యార్థులు కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా, నూతన ఆవిష్కరణలతో సమాజ అభ్యున్నతికి, దేశ నిర్మాణానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు, విశ్వవిద్యాలయ అధికారులు పాల్గొన్నారు. డిగ్రీలు, పతకాలు అందుకున్న విద్యార్థులను పలువురు అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>