కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అభివృద్ధి పనుల పురోగతి గురించి జిల్లా అభివృద్ధి సమన్వయం పర్యవేక్షణ కమిటీ (DISHA Committee) సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో జాతీయ రహదారులు, రోడ్లు, భవన శాఖ, విద్యుత్ శాఖల పనుల ఆలస్యంపై కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామరెడ్డి అధ్యక్షత వహించగా, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ చైర్మన్‌గా వ్యవహరించారు. సభలో ఎంపీలు మాట్లాడుతూ.. ఐటిఎన్ఎ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో ఆలస్యానికి కారణాలు వివరించి నివేదికలు సమర్పించాలని అధికారులు ఖచ్చితంగా సూచించారు.
జిల్లాలో వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆసుపత్రుల పరిశుభ్రత, డయాలసిస్ సేవల విస్తరణ, సికిల్స్ సెల్ అనీమియా, హెచ్‌పీవీ వ్యాక్సిన్ అవగాహన వంటి కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు గ్రామీణాభివృద్ధికి కీలకమైనవిగా ఉండడం వల్ల, ప్రతి పథకం లక్ష్యాల ప్రకారం లబ్ధిదారులకు చేరేలా పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Read Also: వచ్చేది తెలంగాణ ఇంటి పార్టీ: కవిత
Follow Us On: X(Twitter)

