ఇంద్ర‌కీలాద్రిలో గుడి ముందే రీల్స్‌.. ప‌ట్టించుకోని అధికారులు

క‌లం, వెబ్‌డెస్క్‌: విజ‌య‌వాడ‌ (Vijayawada)లో మ‌రోసారి భ‌ద్ర‌తా వైఫ‌ల్యం బ‌ట్ట‌బ‌య‌లైంది. ఆల‌య‌ (Temple) అధికారుల నిర్ల‌క్ష్యంతో వ‌రుస అవాంఛ‌నీయ‌ ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయి. గ‌తంలో చెప్పులతో ఆల‌యంలోకి రావ‌డం, పాడైపోయిన ప‌దార్థాల‌తో ప్ర‌సాదం, ఫేక్ ద‌ర్శ‌న టికెట్ల దందా వంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకోగా తాజాగా ఓ యువ‌తి ఆల‌యం ముందే డ్యాన్స్ చేస్తూ రీల్స్ (Reels) చేయ‌డం తీవ్ర విమ‌ర్శ‌లకు దారి తీసింది.

ఆల‌య అధికారుల కార్యాల‌యాలు అక్క‌డే ఉన్నా ఒక్క‌రు కూడా ఈ రీల్స్ రికార్డింగ్‌ను అడ్డుకోలేదు. ఈ ఘ‌ట‌న‌పై భ‌క్తులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. వెంట‌నే స‌ద‌రు యువ‌తిపై చ‌ర్యలు తీసుకొని, ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చూడాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>