కలం, వెబ్ డెస్క్: ప్రస్తుత సినిమా పరిస్థితులపై ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar) సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా విడుదలైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తుండటంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం పూర్తిగా మానేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటీటీ (OTT) రిలీజ్‌తో థియేటర్ వ్యవస్థను కిల్ చేయడమేనని ఆయన మండిపడ్డారు. ఒక సినిమాను థియేటర్‌లో చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలగాలంటే థియేటర్ విడుదలకు, డిజిటల్ స్ట్రీమింగ్‌కు మధ్య కనీసం 3 నెలల గ్యాప్ ఉండాలన్నారు. అప్పుడే సినిమా బ్రతుకుతుంది, ఎగ్జిబిటర్లు నిలబడతారని గుణశేఖర్ స్పష్టం చేశారు. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో థియేటర్లు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆయన మండిపడ్డారు.
Read Also: సమంత హెల్త్ సీక్రెట్స్ ఇవే.. ఉదయాన్నే ఇవి పాటించేయండి!
Follow Us On: X(Twitter)

