కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ జాతిపితగా గద్దర్ (Gaddar) ను గుర్తించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫర్డ్ (Kancha Ilaiah) డిమాండ్ చేశారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ‘గద్దర్ గళం’ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ భేటీకి ఉద్యమకారులు, మేధావులు, కవులు, కళాకారులు హాజరై ప్రభుత్వం గద్దర్ ను తెలంగాణ జాతిపితగా గుర్తించాలని తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కంచ ఐలయ్య మాట్లాడుతూ.. గద్దర్ పక్షాల్లో రెండు ఉన్నాయని అందులో ఒకటి విప్లవ పక్షం.. రెండోది తెలంగాణ పక్షం అని తెలిపారు.
ఫాదర్ ఆఫ్ తెలంగాణ గా గద్దర్ కు అన్ని అర్హతలు ఉన్నాయని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు. గద్దర్ ను జాతిపితగా గుర్తించాలని ముందు నుండే ప్రతిపాదిస్తున్నానని గుర్తు చేశారు. గద్దర్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. కడుపులో బుల్లెట్లు పెట్టుకుని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని.. ఉద్యమాన్ని మలుపు తిప్పే పాటలు పాడారు.. రాశారని గుర్తు చేశారు. ప్రభుత్వ పదవుల కోసం గద్దర్ ఏనాడూ పాకులాడలేదని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా పదవులు అశించకుండా గద్దర్ అధికారానికి దూరంగా ఉన్నారని కంచె ఐలయ్య (Kancha Ilaiah) పేర్కొన్నారు.
Read Also: క్రికెట్ ఐడల్స్ గురించి మనసు విప్పిన అర్జున్ టెండూల్కర్!
Follow Us On: Sharechat

