ఏఆర్‌ రెహ‌మాన్ గురించి పుస్త‌కం రాస్తా: డైరెక్ట‌ర్ బుచ్చిబాబు

క‌లం, వెబ్ డెస్క్: మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) హీరోగా న‌టించిన లేటెస్ట్ మూవీ పెద్ది (Peddi) విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. జూన్ 4న ఈ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో మూవీ టీం ప్ర‌మోష‌న్ల‌తో బిజీబిజీగా రాష్ట్రాలు చుట్టేస్తోంది. తాజాగా ఈ మూవీ టీం చెన్నైలో ప్ర‌మోష‌న్ ప్రోగ్రామ్‌లో సంద‌డి చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో హీరో రామ్ చ‌ర‌ణ్‌, హీరోయిన్ జాన్వీ క‌పూర్‌, డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానా (Buchi Babu Sana), మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఏఆర్ రెహ‌మాన్ స‌హా మ‌రికొంద‌రు మూవీ టీం పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ బుచ్చిబాబు మాట్లాడుతూ ఏఆర్ రెహ‌మాన్‌పై త‌న అభిమానాన్ని చాటుకున్నారు. ఏకంగా ఏఆర్ రెహ‌మాన్ గురించి ఓ పుస్త‌క‌మే రాస్తాన‌ని చెప్పారు. చిన్నప్పుడు తనకు మ్యూజిక్ అనే పదం పలకడం కూడా రాదని స్నేహితులు ఎగతాళి చేసేవారని, కానీ నేడు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ రెహమాన్‌తో కలిసి సినిమా చేసే స్థాయికి చేరుతానని అసలు ఊహించలేదని బుచ్చిబాబు ఎమోషనల్ అయ్యారు. రెహమాన్ మీద నాకున్న ఇష్టంతో ఆయ‌న‌ గురించి ఓ పుస్తకమే రాస్తానంటూ సంతోషం వ్య‌క్తం చేశారు. బుచ్చిబాబు చేసిన ఈ వ్యాఖ్యలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>