కలం, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’ (PEDDI). టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా (Buchi Babu Sana) తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరుసగా వాయిదా పడుతున్న పెద్ది మూవీకి ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. తాజాగా దర్శకుడు బుచ్చిబాబు సనా ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ‘పెద్ది’ మూవీ ఎడిటింగ్ పూర్తి అయిందని, జూన్ 3, 2026 నుండి భారీ ప్రీమియర్స్ ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఈ సినిమాను జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మరోసారి స్పష్టం చేశారు. ‘గెట్ రెడీ ఫర్ పెద్ది’ హ్యాష్‌ట్యాగ్‌తో ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

