కలం, సినిమా : దిల్ రాజు (Dil Raju).. ఒకప్పుడు వరుసగా బ్లాక్ బస్టర్స్ అందించిన నిర్మాత. ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాలు అందించారు. ఆయన బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే.. ఖచ్చితంగా బాగుంటుంది.. ఎలాంటి ఇబ్బంది లేకుండా కుటుంబం అంతా కలిసి చూడచ్చు అనే బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. అయితే.. ఇటీవల కాలంలో దిల్ రాజు నుంచి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిలవడం లేదు. కాసుల వర్షం కురిపించడం లేదు. అందుకనే ఇప్పుడు ప్లాన్ మార్చారు. ఇంతకీ.. ఏంటా ప్లాన్..? ఈసారైనా ప్లాన్ ఫలిస్తుందా..? సక్సెస్ వస్తుందా..?
ఇప్పుడు రక్తపాతం ఎక్కువగా చూపించడం అనేది ఓ ట్రెండ్ గా మారింది. స్టార్ హీరో సినిమాల్లో రక్తపాతం ఎంత ఎక్కువ ఉంటే.. అంత పెద్ద హిట్ అవుతుంది అనేట్టుగా తయారైంది. ఈమధ్య కాలంలోనే కాదు.. అంతకు ముందుకు వెళితే.. మగధీర సినిమాలో రామ్ చరణ్ 100 మందిని చంపడం తెరపై చూశాం. ఆతర్వాత సినిమాల్లో భీభత్సమైన రక్తపాతం చూపిస్తున్నారు. ప్రభాస్ సాహో సినిమా కావచ్చు.. సలార్ సినిమా కావచ్చు.. ఊహించడానికే కష్టంగా ఉందనిపించేలా రక్తపాతాన్ని చూపిస్తున్నారు. జనాలు కూడా చూస్తున్నారు.
పుష్ప, పుష్ప 2 సినిమాల్లో భీభత్సం చూశాం. ఎన్టీఆర్ దేవర, యశ్ కేజీఎఫ్, కేజీఎఫ్ 2.. ఇలా స్టార్ హీరోల సినిమాలు రక్తపాతంతోనే వస్తున్నాయి. అందుకనే ట్రెండ్ కు తగ్గట్టుగా దిల్ రాజు మారారు. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో చేస్తున్న రౌడీ జనార్థన (Rowdy Janardhana) మూవీలో రక్తపాతం మామూలుగా లేదు. ఇది దిల్ రాజు (Dil Raju) సినిమానేనా..? అనేంతగా రక్తపాతాన్ని జస్ట్ శాంపిల్ అన్నట్టుగా చూపించారు. ఇదే విషయాన్ని దిల్ రాజును అడిగితే.. ట్రెండ్ కు తగ్గట్టుగా ఉండాలనే ఇలా రక్తపాతాన్ని చూపించినట్టుగా ఆయన చెప్పారు. మరి.. ట్రెండ్ కు తగ్గట్టుగా తనని తాను మార్చుకున్న దిల్ రాజు ఈసారైనా బ్లాక్ బస్టర్ సాధిస్తారేమో చూడాలి.
Read Also: నీ అభిప్రాయాలను మడిచి.. శివాజీపై ఆర్జీవీ ఆగ్రహం
Follow Us On : WhatsApp


